ఏపీలో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాంలో రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో పాటు ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దక్షిణ కోస్తా ఆంధ్రలో రేపు ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఎల్లుండి ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు రాయలసీమలో ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని, ఎల్లుండి ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.