ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తప్పిపోయిన కుక్క.. తెలివిగా ఏం చేసిందంటే..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 13, 2020, 08:03 PM

ఇంటి నుంచి తప్పిపోయిన కుక్క తెలివిగా ఇళ్లు చేరింది. ఇందుకు ఆ కుక్క చేసి ప్రయత్నం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది థాయిలాండ్‌లోని సామత్ ప్రాకన్ నగరం. అక్కడి పెట్ క్లినిక్ దగ్గర ఓ కుక్క తచ్చాడుతూ కనిపించింది. డోర్ ఎలా ఓపెన్ చేయాలో ఆ కుక్కకు తెలియలేదు. అందుకే అక్కడే అటూ ఇటూ తిరుగుతూ ప్రయత్నించింది. ఇది గమనించిన క్లినిక్ నిర్వాహకులు కాసేపటి తర్వాత తలుపు తీశారు. ఆనందంగా లోపలికి వెళ్లిన కుక్క తోక ఊపుతూ లోపల అంతా తిరిగింది. కొద్దిసేపటికి ఆ క్లినిక్ నిర్వాహకులకు అది ఎవరి కుక్కో తెలిసింది. ఆ కుక్క యజమాని దాన్ని ఆ క్లినిక్‌ కు తీసుకొచ్చి వైద్య పరీక్షలు చేయిస్తూ ఉంటారు.ఈసారి కుక్క ఒక్కటే రావడంతో నిర్వాహకులు దాని యజమానికి ఫోన్ చేసి విషయం చెప్పారు. అప్పటివరకూ తన కుక్క కనిపించట్లేదని ఎంతో ఆవేదనతో ఉన్న దాని యజమాని సునీ బన్వారా అది ఎక్కడుందో తెలియడంతో ఎంతో సంబరపడ్డారు. వెంటనే ఆ క్లినిక్‌ కు వచ్చారు. అప్పటికి టైమ్ రాత్రి 9 అయ్యింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి తన కుక్క కనిపించకుండా పోయిందనీ సునీ బన్వారా చెప్పారు. సునీ ఓ రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో బయటి నుంచి కొన్ని కుక్కలు వచ్చాయి. ఆ సమయంలో వాటితో ఆడుకుంటుందిలే అని తన కుక్కను వదిలేశారు. ఆ తర్వాత ఆమె కస్టమర్ల పనిలో పడిపోయారు. గంట తర్వాత కుక్క కనిపించలేదు. అది తిరిగి క్లినిక్ దగ్గర కలవడంతో ఆమె ఎంతో సంతోషించారు. క్లినిక్ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com