ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో అడ్డు అదుపు లేకుండా విజృంభిస్తున్న కరోనా...

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 06, 2020, 04:48 PM

ఏపీలో కరోనా మహమ్మారి అడ్డు అదుపు లేకుండా విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోందే తప్ప, నియంత్రణలోకి రావడంలేదు. తాజాగా 1322 పాజిటివ్ కేసులు వచ్చాయి. రాష్ట్రంలో ఒక్కరోజులో ఇన్ని కేసులు రావడం ఇదే ప్రథమం. అంతేకాదు, ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20 వేలు దాటింది.


గుంటూరు జిల్లాలో అత్యధికంగా 197, తూర్పుగోదావరి జిల్లాలో 171, అనంతపురం జిల్లాలో 142, కర్నూలు జిల్లాలో 136, చిత్తూరు జిల్లాలో 120, పశ్చిమ గోదావరి జిల్లాలో 106, విశాఖపట్నం జిల్లాలో 101 కొత్త కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో కరోనాతో ఏపీలో ఏడుగురు మృత్యువాత పడ్డారు. దాంతో కరోనా మరణాల సంఖ్య 239కి పెరిగింది. తాజాగా 424 మంది డిశ్చార్జి కాగా, 10,860 మంది చికిత్స పొందుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com