ట్రెండింగ్
Epaper    English    தமிழ்

5 నిమిషాల్లో రూ.5 లక్షల రుణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 25, 2020, 02:31 PM

టెక్నాలజీ పెరిగిన కొద్ది సేవలన్నీ సులభంగా అందుబాటులోకి వస్తున్నాయి. గతంలో లోన్స్ తీసుకోవాలంటే బ్యాంకు దగ్గర పడిగాపులు కాయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు క్షణాల్లో లోన్స్ తీసుకునే అవకాశం ఉంది. తాజాగా నవీ అనే సంస్థ నవి లెండింగ్ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా 5 నిమిషాల్లో రూ.5 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ యాప్ లోకి వెళ్లి NAVI instant personal loans అనే యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని వివరాలన్ని సబ్ మిట్ చేయాలి. దీని సాయంతో కస్టమర్లు ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. రూ.5 లక్షల వరకు రుణం పొందొచ్చు. తీసుకున్న రుణాన్ని 36 నెలలలోగా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. పాన్ నెంబర్,ఆధార్ నంబర్ వంటివి అవసరం లేకుండానే రుణం పొందవచ్చు. నేరుగా అకౌంట్లోకి నగదు జమ కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com