వర్క్ వీసాల నిలిపివేతపై టెక్ కంపెనీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. సిలికాన్ వ్యాలీ కంపెనీలు ట్రంప్ నిర్ణయాన్ని తప్పుబడుతున్నాయి. గూగుల్, ఆల్ఫాబెట్ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ ట్రంప్ నిర్ణయంపై అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ట్విట్టర్ అకౌంట్ ద్వారా స్పందించారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం తనను నిరుత్సాహాపరిచిందని, అమెరికా ఆర్థిక ప్రగతిలో ఇమ్మిగ్రేషన్ విధానం ఎంతో తోడ్పడిందన్నారు. ఆ కారణంగానే అమెరికా టెక్నాలజీ రంగంలో గ్లోబల్ లీడర్‌గా మారిందన్నారు. ఈ రోజు గూగుల్ కంపెనీ ఇలా ఉందంటే, అది ఇమ్మిగ్రాంట్ల వల్లే అని పిచాయ్ తెలిపారు. విదేశీ టెకీలకు వీసాలు జారీ చేయబోమని ట్రంప్ చేసిన ప్రకటన నిరుత్సాహాపరిచినా.. తాము మాత్రం ఇమ్మిగ్రాంట్స్‌కు మద్దతుగా ఉంటామని, అన్ని రకాలుగా అవకాశాలు కల్పిస్తూనే ఉంటామని పిచాయ్ తన ట్విట్టర్లో తెలిపారు. హెచ్1బీ వీసాల జారీని రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే.