ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రతి ఒక్కరికి రూ.25,000.. వారికి మాత్రమే!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 21, 2020, 05:20 PM

ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ యోజన పేరుతో కేంద్ర ప్రభుత్వం శనివారం కొత్త స్కీమ్‌ తీసుకువచ్చింది. కరోనాతో చాలా మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే కార్మికులు, వలస కూలీలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా మోదీ సర్కార్ ఈ పథకాన్ని తీసుకువచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కోసం రూ.50,000 కోట్లు కేటాయించింది. బీహార్‌లో ప్రధాని మోదీ ఈ స్కీమ్‌ను ఆవిష్కరించారు.వలస కూలీలు, కార్మికులకు ఎంఎన్ఆర్ఈజీఏ (గ్రామీణ ఉపాధి హామీ పథకం- కరుపు పని) పథకంలో భాగంగా వారి ఊరిలోనే పని లభిస్తుంది. . రోజుకు రూ.182 నుంచి రూ.202 వరకు పొందుతారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద 125 రోజులు ఉపాధి కల్పిస్తుంది. అంటే రోజుకు రూ.202 ప్రకారం చూస్తే.. మొత్తంగా రూ.25,250 పొందొచ్చు.ప్రభుత్వాలు అందించే 25 రకాల స్కీమ్స్‌లో వీరికి ఉపాధి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే ఈ స్కీమ్ తొలిగా 6 రాష్ట్రాల్లోని 116 జిల్లాల్లో అమలులో ఉంటుందని మోదీ సర్కార్ తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే ఈ స్కీమ్‌కు గురించి వివరాలను వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com