ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కన్న కూతురుపై తండ్రి అత్యాచారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 19, 2020, 04:05 PM

కంటికి రెప్పలా కూతురును కాపాడాల్సిన తండ్రే మృగంలా మారాడు. కామంతో కళ్లు మూసుకుపోయి కన్న కూతురిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటన హైదరాబాద్ లోని సూరారంలో చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముండే ఓ పెయింటర్‌ ఈ దుర్మార్గానికి పాల్పడ్డాడు. తన 14 ఏళ్ల కూతురిని బెదిరించి అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక ఆరు నెలల గర్భం దాల్చింది. తల్లి ప్రశ్నించడంతో ఈ దురాగతం బయటపడింది. దీంతో స్థానికులు ఆగ్రహంతో ఆ కీచక తండ్రికి దేహశుద్ధి చేశారు. బాలిక ఫిర్యాదుతో దుండిగల్‌ పోలీసులు పోక్సో చట్టం కింద ఆ దుర్మార్గుడిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com