ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ద‌ళితుల్ని మోసం చేయ‌డానికే చంద్ర‌బాబు కుట్ర : ఎంపీ నందిగం సురేష్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 19, 2020, 04:00 PM

ద‌ళితుల్ని మోసం చేయ‌డానికే చంద్ర‌బాబు కుట్ర. గెలిచే సీటు ఇవ్వని బాబు.. ఓడిపోయే సీటుకు పోటీ చేయిస్తారా? అధికారంలో ఉన్న‌పుడు గెలిచే సంద‌ర్భంలో ఏనాడు కూడా ద‌ళితుల‌కు, బీసీల‌కు, ‌సామాన్యుల‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని ఆలోచించ‌ని చంద్ర‌బాబు నాయుడు అధికారం పోయిన త‌ర్వాత ద‌ళితుల మీద లేని ప్రేమను సృ‌ష్టించుకొని ఓడిపోయే సీటుకి వ‌ర్ల రామ‌య్య‌ గారిని పోటీకి పెట్టారని ఎంపీ నందిగం సురేష్ తెలిపారు.


వ‌ర్ల రామ‌య్య‌ ఎప్ప‌టి నుంచో పార్టీని న‌మ్ముకొని ఉన్నారు కాబ‌ట్టి.. ఇవాళ ఓడిపోయే ‌సీటైనా ఇవ్వాల‌ని ఓడిపోయే స్థానానికి ఆయ‌న‌తో పోటీ చేయించారు. వ‌ర్ల రామ‌య్య కూడా ఓడిపోయే స్థానానికి ఆలోచించ‌కుండా పోటీ చేశారు.త‌న కుమారుడు లోకేశ్‌ను గెలిచే స్థానంలో ఎమ్మెల్సీగా పోటీ చేయించి ఆ తర్వాత అడ్డ‌దారిలో మంత్రిని చేశారని ఎంపీ నందిగం సురేష్ అన్నారు.  ఎన్నో సంవ‌త్స‌రాల నుంచి చంద్ర‌బాబుని న‌మ్ముకున్న ఆ పార్టీ ద‌ళిత నేత‌ల‌కు లేదా వ‌ర్ల రామ‌య్య‌గారికి ఆరోజున అవ‌కాశం ఇచ్చి ఉంటే బాగుండేది. గెలిచే దానికి ఆయ‌న కుమారుడు.. ఓడిపోయే దానికి ద‌ళితులు అన్న‌ది చంద్ర‌బాబు సిద్థాంతమని ఎంపీ నందిగం సురేష్ తెలిపారు.


నిన్న పెద్దల స‌భ‌లో లోకేశ్‌ వ్య‌వ‌హార శైలి మీరంద‌రూ చూశారు.. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ శాస‌న‌స‌భ‌లో కానీ, మండ‌లిలో కానీ ‌ఫోన్ వాడ‌కూడదు, రికార్డ్ చేయ‌కూడ‌దు. కానీ, లోకేశ్‌ చ‌క్క‌గా ఫోటోలు తీస్తూ అడ్డంగా దొరికిపోయి, ఇష్టాను‌సారంగా వ్య‌వ‌హ‌రించడ‌మే కాకుండా ఏ విధంగా మంత్రిగారిపై దాడి చేశారో చూశామన్నారు. వాళ్ల దుర్మార్గ‌పు, కుట్ర‌పూరిత బుద్ది ఇంకా మార‌లేదని ఎంపీ నందిగం సురేష్ మండిపడ్డారు.  అధికారం పోయిన తర్వాత దాన్ని జీర్ణించుకోలేక.. ఏడాది కాలానికే మ‌ద‌న‌ ప‌డుతున్నారు. ఇంకా నాలుగు ఏళ్లు మేం భరించాలా, అధికారం లేక‌పోతే మేము ఉండ‌లేమనే విధంగా వీళ్లు త‌యార‌య్యారని ఎంపీ నందిగం సురేష్ అన్నారు.


 ఇప్పుడే రాజ్య‌స‌భ స్థానాల‌కు జ‌రిగిన‌ ఎన్నిక‌ల‌కు చంద్ర‌బాబు, బాల‌కృ‌ష్ణ ఓటేసీ తుర్రుమ‌నీ మ‌ళ్లీ హైద్రాబాద్‌కు వెళ్లిపోయారు. రాష్ట్రం మొత్తం కోవిడ్‌తో చాలా ఇబ్బందులు ప‌డుతుంటే వీళ్లు మాత్రం హైద్రాబాద్‌లో ఉంటూ పిట్ట‌క‌థ‌లు చెప్పుకుంటా తిరుగుతున్నారు. టీడీపీ తీరును రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రూ చూస్తున్నారని ఎంపీ నందిగం సురేష్ తెలిపారు.


 ఎన్న‌డూ లేని విధంగా రాజ్య‌స‌భ‌కు ఇద్ద‌రు బీసీల‌కు అవ‌కాశం క‌ల్పించి ముఖ్య‌మంత్రి శ్రీ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు గొప్ప అవ‌కాశం ఇచ్చారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల‌కు నామినేటెడ్ పోస్టుల్లో, ప‌నుల్లో  50% రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించడ‌మే కాకుండా అన్ని విధాలుగా వారిని ఆదుకున్న వ్య‌క్తి ఎవ‌రైనా ఉన్నారంటే ఒక్క శ్రీ వైయస్‌ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారేనని ఎంపీ నందిగం సురేష్ అన్నారు. 


 ఈ దేశం మొత్తం మీదే కాదు ప్ర‌పంచంలోనే  పేద‌ల‌కు ఇంత అండ‌గా నిల‌బ‌డిన సీయం ఎవ‌రైనా ఉన్నారా అని  ఎక్క‌డ వెతికిన క‌నిపించ‌ని ప‌రిస్థితి.. ఒక్క ఏపీలో శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేదలకు అండగా నిలిచారని నందిగం సురేష్‌ పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com