ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అచ్చెన్నాయుడు అరెస్ట్‌పై స్పందించిన జనసేన అధినేత పవన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 13, 2020, 03:23 PM

టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు అరెస్ట్‌పై జనసేన అధినేత పవన్ స్పందించారు. అవినీతికి పాల్పడినందుకా? లేక కక్ష సాధింపు కోసమా? ఆయన్ను అరెస్ట్ చేసింది అని పవన్ ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా స్పందించిన పవన్.. అచ్చెన్నాయుడు అరెస్ట్‌పై ప్రభుత్వ చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. అవినీతి ఏ రూపంలో ఉన్నా, బాధ్యులెవరైనా జనసేన వ్యతిరేకిస్తుందని పవన్ స్పష్టం చేశారు. అయితే అసెంబ్లీ సమావేశాలకు కొన్ని రోజుల ముందు అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేయడం సందేహాలకు తావిస్తోందన్నారు. ప్రజాప్రతినిధిని అరెస్ట్ చేసే సమయంలో నిబంధనలు పాటించాలన్నారు. ఈఎస్ఐ స్కామ్‌తో పాటు, అన్ని అక్రమాలపై దర్యాప్తు జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పవన్ డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com