ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు శ్రీరామ నవమి.. ఆలయాల వద్ద కనిపించని సందడి!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 02, 2020, 08:19 AM

కరోనా రక్కసి దేశంలోకి, తెలుగు రాష్ట్రాల్లోకి జొరబడకుండా ఉండి వుంటే నేడు శ్రీరామ నవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగి ఉండేవి. వాడవాడనా ఉండే రామాలయాలు భక్తులతో కిటకిటలాడేవి. మధ్యాహ్నం అన్న ప్రసాదాల వితరణతో సందడిగా మారేవి. కానీ ఈ మహమ్మారి కారణంగా.. ఎటువంటి ఆర్భాటాలు, సందడి లేకుండానే శ్రీరామ నవమి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ ఉదయం సీతారామ లక్ష్మణులకు తిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి 10 గంటలకు బంగారు వాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థాన వేడుక నిర్వహించనున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. రేపు రాత్రి 8 గంటలకు బంగారు వాకిలి చెంత శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తారు. వైరస్ కలవరపెడుతుండడంతో ఈ వేడుకలన్నీ ఏకాంతంగానే నిర్వహించనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com