నెల్లూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థినిపై స్కూల్ వ్యాన్ డ్రైవర్ అత్యాచారయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలాన్ని రేపింది. విద్యా విహార్ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై అదే స్కూల్లో వ్యాన్ డ్రైవర్గా పని చేస్తున్న శివ లైంగిక దాడికి యత్నించాడు. విషయాన్ని గమనించిన స్థానికులు శివకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అనంతరం ఆగ్రహంతో స్థానికులు స్కూల్ వ్యాన్ను తగలబెట్టారు.