ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళా రక్షణకై ఏపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు : హోంమంత్రి సుచరిత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 09, 2019, 08:20 PM

మహిళ రక్షణ, భద్రతను కట్టుదిట్టం చేయటానికి ఏపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోందని... అందులోభాగంగా అనేక  కార్యక్రమాలను చేపడుతున్నట్లు హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. సోమవారం ప్రారంభమైన శాసనసభ సమావేశాల్లో ఆమె మాట్లాడుతూ.. మహిళలు, కిశోర బాలికలను చైతన్యపరిచి సాధికార పరచటానికై అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఏపీ పోలీస్, శిశుసంక్షేమ శాఖలు మహిళల రక్షణ, సంక్షేమానికి కట్టుబడి ఉన్నాయన్నారు. ఈ అంశాలు సాధించటానికి అనేక చొరవలతో ముందుకు వచ్చాయని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలను ఆమె సభలో వివరించారు.
ప్రభుత్వం 11వేల గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి, 3వేల వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శిలు మొత్తం 14వేల ఉద్యోగాలను నోటిఫై చేయటం జరిగిందన్నారు. 7.12.19 నాటికి ఈ ఉద్యోగాల్లో 9,574 మంది చేరారని తెలిపారు. 2,271 మందితో కూడిన మొదటి బ్యాచ్‌ను 9.12.2019 నుండి 23.12.2019 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్‌ శిక్షణా కేంద్రాల్లో శిక్షణకు పంపటం జరుగుతుందని వివరించారు. కార్యదర్శులు శిక్షణ పొందేవరకు ఈ శిక్షణ కొనసాగుతుందన్నారు. గ్రామ, వార్డు సంరక్షణ కార్యదర్శులను సచివాలయాల్లో నియమించటం జరిగిందన్నారు. దీనివల్ల పోలీసు సేవలు మెరుగుపడటం జరుగుతుందని సుచరిత అన్నారు.
శాంతిభద్రతల అంశాలు, కుల సంఘర్షణలు, పౌర వివాదాలు, వ్యవసాయ సంబంధ సమస్యలు, నీటి పంపక అంశాలు మొదలగు వాటితో ఎస్‌హెచ్‌ఓలకు వీరు ఉపయోగకరంగా ఉంటారన్నారు. ప్రధాన శాంతిభద్రతల సమస్యలను నివారించటంలో ఎస్‌హెచ్‌ఓకు సహాయపడటం జరుగుతుందని హోంమంత్రి సుచరిత వివరించారు.  
''మహిళా ముఖ్య కమిటీకి వీరు కన్వీనర్‌గా ఉండటం జరుగుతుంది. గ్రామ పోలీసు అధికారులతో కలిసి పాఠశాల, కళాశాలలను సందర్శించి రోడ్డు భద్రత, సైబర్‌ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించటం జరుగుతుంది. సామాజిక దురలవాట్లపై ఎస్‌హెచ్‌ఓకు సమాచారాన్ని సమకూరుస్తారు. ఆత్మహత్యలు, ఒత్తిడి నిర్వహణ అంశాలపై రైతులకు కౌన్సిలింగ్‌లో వీళ్లు పాల్గొంటారు. గ్రామవాలంటీర్లు సేకరించిన సమాచారాన్ని ఎస్‌హెచ్‌ఓకు పంపటం జరుగుతుంది. దీంతోపాటు కేసుల దర్యాప్తులో నేరస్థలం రక్షించటం, తప్పిపోయిన కేసులు పర్యవేక్షించటం, బాల్యవివాహాలు నివారించటంలో ఎస్‌హెచ్‌ఓకు సహాయపడతారు'' అని సుచరిత వివరించారు. మద్యపాన వ్యసనం, మత్తుమందులు, లింగ వివక్షత మొదలగు విషయాలపై అవగాహన కల్పిస్తారని అన్నారు. కేంద్ర ఎస్‌డబ్ల్యు సమన్లు అందించటంలో స్థానిక పోలీసులకు వీరు సహాయపడతారన్నారు. అన్ని కేసుల సాధనలో వీరు సాక్ష్యులుగా ఉంటారని, స్పందన, సురక్ష యాప్‌లో పేర్కొన్న 89 సేవలు సమకూర్చటంలో పీఎస్‌, పౌరుల మధ్య వీరు వారధులుగా పనిచేస్తారని తెలిపారు.
అదేవిధంగా మహిళా మిత్ర చొరవను ఏపీ పోలీస్‌ విభాగం చేపట్టం జరిగిందన్నారు. సమాజం ఆలోచనలు మారుస్తూ సమాజంలోని అన్ని వర్గాలకు ప్రత్యేకించి యువత, బాలలకు అవగాహన కల్పించి మహిళలపై నేరాలు తగ్గిటంచటమే లక్ష్యంగా ఉందన్నారు. సీఐడీ, మహిళా రక్షణ విభాగపు అదనపు ఎస్పీ రాష్ట్ర నోడల్‌ అధికారిగా ఉండగా, డిప్యూటీ ఎస్పీ, మహిళా సీఐ, మహిళా డిప్యూటీ ఎస్పీ జిల్లా నోడల్ అధికారిగా ఉండటం జరుగుతుందని తెలిపారు.  
ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో ఇద్దరు పోలీస్‌ అధికారులను మహిళా మిత్ర సమన్వయకర్తలుగా చేసి మహిళా మిత్ర ఉద్దేశాలు, లక్ష్యాలపై శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. మహిళా మిత్ర సమన్వయకర్తలు, మహిళలు, బాలల సమస్యలపై అవగాహన కలిగిన మహిళా వాలంటీర్లు, ప్రఖ్యాతి గాంచిన ఎన్జీఓలు, ఉపాధ్యాయులతో ప్రతి గ్రామం, వార్డు కోసం ఒక్కో కమిటీ కోసం ఏర్పాటు చేస్తారని సుచరిత వివరించారు.  
మహిళా మిత్ర గ్రామ/వార్డు కమిటీల్లో గ్రామ/వార్డు సంరక్షణ కార్యదర్శి కన్వీనర్‌గా చేర్చబడతారని తెలిపారు. ''మహిళలు, బాలలకు సంబంధించిన అంశాలను గుర్తించటం. పోలీస్‌ స్టేషన్‌కు సత్వరమే నివేదించటమన్నారు. పోలీస్‌ సమన్వయకర్తతో పాటుగా కమిటీ సమావేశాలు నిర్వహించటం. స్థానిక ప్రజలకు చట్టాలు, నియమాలపై అవగాహన కల్పించటం, గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌, బాలల లైంగిక దుర్భాష గురించి పిల్లల్లో అవగాహన కల్పించటం, హెల్ప్‌ లైన్‌ గురించి అవగాహన, బాల్యవివాహాలు, బాల్య కార్మిక వ్యవస్థ, బెల్ట్‌ షాపులు, గేమింగ్‌, పని ప్రదేశాల్లో వేధింపులు గురించి సమాచారం ఇవ్వటం'' ఈ కమిటీ యొక్క బాధ్యత అని సుచరిత తెలిపారు.
సైబర్‌ మిత్ర వాట్సాప్‌ నెంబర్‌ 9121211100... తక్షణమే నేరాలు నమోదుకు జీరో ఎఫ్‌ఐఆర్‌
ఆపదలో ఉన్న మహిళలకు తక్షణమే పరిష్కరించటం కోసం సైబర్‌ మిత్ర ప్రత్యేక వాట్సాప్‌ నెంబర్‌ 9121211100 ఏర్పాటు చేయటం జరిగింది. అంతేగాక సైబర్ నేరాలపై అవగాహన కల్పించటం, మహిళల్లో విశ్వాసాన్ని నింపటానికి బహిరంగ ప్రచారాలు, అవగాహన కార్యక్రమాల్ని నిర్వహించటం జరుగుతుందని సుచరిత వివరించారు.
మహిళల భద్రత కోసం కఠినమైన న్యాయ చర్యలు చేయటానికి వీలుగా మహిళా నేరాలపై కేసులు తక్షణ నమోదు చేయటానికి అన్ని పోలీస్‌ స్టేషన్‌ అధికారులకు దీర్ఘకాలిక సూచనలు ఇవ్వటం జరిగిందన్నారు. జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయటానికి ఏపీ డీజీపీ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటం జరిగిందన్నారు.  
పోస్కో కేసుల పరిష్కారం కోసం 8 ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు
ప్రత్యేక ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేసి మహిళలపై నేరాల పరిష్కారం కోసం 13 జిల్లాల్లో ఒక్కొక్కటి ఉన్నాయి. వీటికి అదనంగా 2019 అక్టోబర్‌ 2 నుంచి పోస్కో కేసుల పరిష్కారం కోసం 8 ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు పనిచేస్తున్నాయి. మహిళా హెల్ప్‌ లైన్‌ 100, 112 ఏకైక అత్యవసర హెల్ప్‌ లైన్‌ ఇందులో పోలీస్‌, అగ్నిమాపక, ఇతర హెల్ప్‌లైన్‌ కలిసి ఉంటాయి.
ఏపీ మహిళా హెల్ప్‌లైన్‌ సార్వత్రీకరణ కింద.. 181 ప్రత్యేకంగా ఉంది. ఉచిత హెల్ప్‌లైన్‌ కింద 181కి నిర్భయ కింద నిధులు సమకూర్చటం జరుగుతుంది. 2016 నుంచి ఈరోజు వరకు 7,95,989 కాల్స్‌ స్వీకరించటం జరిగింది. 6,63,636 కాల్స్‌ సమాచారం కోసం సమాధానం ఇవ్వటం జరిగిందని హోంమంత్రి సుచరిత తెలిపారు. తక్షణ సహాయం కింద చెల్లుబాటు అయ్యే కేసులుగా 3,480 కాల్స్‌ గుర్తించటం జరిగిందన్నారు.
మహిళా పోలీస్‌ వాలంటీర్లుతో మంచి ఫలితాలు
కేంద్ర ప్రభుత్వ డబ్ల్యుసీ మంత్రిత్వశాఖ మహిళా పోలీస్‌ వాలంటీర్లు ప్రారంభించటం జరిగిందని సుచరిత వివరించారు. జెండర్‌ సమస్యలపై పోలీసులకు అందుబాటులో స్థానికంగా సాధికారితక గల సామాజిక అవగాహన మహిళలకు ఎంపీవీలుగా తీర్చిదిద్దటం జరిగిందని సుచరిత అన్నారు. ఎంపీవీలు మహిళలపై నేరాలను ఎదుర్కోవటానికి పబ్లిక్‌ పోలీస్ ఇంటర్‌ఫేస్‌గా సేవల్ని అందిస్తారు.
 గృహహింస, బాల్యవివాహాలు, వరకట్న వేధింపులు, బహిరంగ ప్రదేశాల్లో మహిళలు ఎదుర్కొంటున్న హింసవంటివి నివేదించటం మహిళా పోలీస్‌ వాలంటీర్‌ కర్తవ్యంగా ఆమె అన్నారు. సమాజానికి వీరు ఆదర్శంగా ఉంటారన్నారు.
 వైయస్‌ఆర్‌ కడప, అనంతపురంలో ఎంపీవీలు తీరు చాలా బావుంది. ప్రస్తుతం ప్రతి జిల్లాల్లో 1500 మంది మహిళా పోలీస్‌ వాలంటీర్‌ పనిచేస్తున్నారు. ఏపీలో మానవ రవాణా నిరోధక యూనిట్లు ఏపీ మహిళాభ్యుదయం, శిశుసంక్షేమ శాఖ సభ్యులు, స్థానిక ఎన్జీఓల సభ్యుల సహకారంతో వ్యక్తుల రవాణా నిరోధించి అరికట్టడం, అవసరమైనప్పుడు ఏలూరు, గుంటూరు, అనంతపురంలో యాంటీ ఉమెన్‌ క్రాఫ్ట్‌ యూనిట్స్‌ ప్రకటించడం జరిగింది.
పోక్సో నేరస్తులపై హిస్టరీ షీట్లు తెరవాలని, పదేపదే అదే నేరాలకు పాల్పడుతున్న నేరస్తులను నిర్భందించాలని యూనిట్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేయటం జరిగిందని సుచరిత వివరించారు. అదే విధంగా పైలెట్ విధానంలో ప్రకాశం జిల్లా పోలీస్‌ స్టేషన్లల్లో ప్రాజెక్ట్ అభయ్‌ ప్రారంభించామన్నారు. ఈ ప్రాజెక్ట్ అభయ్‌ ప్రకారం రాత్రివేళల అవసరం ఉన్న మహిళలను తీసుకురావటానికి ఏర్పాటు చేయటం జరిగిందని హోంమంత్రి సుచరిత మహిళల భద్రతకు తీసుకుంటున్న చర్యలను తెలియజేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com