టీం ఇండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. యువరాజ్‌సింగ్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించారు. 2000 సంవత్సరంలో వన్డే కెరీర్‌ను, 2003లో టెస్ట్ కెరీర్‌ను యువరాజ్‌సింగ్ ప్రారంభించారు. కెరీర్లో 304 వన్డేలు ఆడిన యువరాజ్‌సింగ్ వన్డేల్లో 14 శతకాలు సహా 8,701 పరుగులు చేశారు. కెరీర్లో 40 టెస్టులు ఆడి, 3 శతకాలు చేశారు. యువరాజ్‌సింగ్ కెరీర్లో 58 టీ20 మ్యాచ్‌లు ఆడి 1177 పరుగులు చేశారు. 2011 ప్రపంచ కప్ విజయంలో యువరాజ్‌సింగ్ కీలక పాత్ర పోషించారు.