డార్జిలింగ్ : ప్రత్యేక గూర్ఖాలాండ్ రాష్ట్రం ఏర్పాటు చేయాలనే అంశం ప్రస్తావన ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో కనిపించడం లేదు. దాదాపు మూడు దశాబ్దాల తరువాత తొలిసారిగా ప్రత్యేక గూర్ఖాలాండ్ ప్రస్తావన లేకుండా ఎన్నికల ప్రచారం సాగుతోంది. ప్రత్యేక గూర్ఖాలాండ్ కోసం ఉద్యమించిన జిజెఎం, జిఎన్ఎల్ఎఫ్ పార్టీలు కూడా ప్రస్తుతం అభివృద్ధి, ప్రజాస్వామ్య పునరుద్ధరణపై దృష్టి సారించాయి. 1986లో ప్రత్యేక గూర్ఖాలాండ్ ఉద్యమం ప్రారంభమైననాటినుంచి ప్రతి ఎన్నికల సమయంలోనూ రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ను అమలు చేయాలని, గూర్ఖాలాండ్ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. అయితే ప్రస్తుతం ఎవరూ ఈ అంశాన్ని ప్రస్తావించడం లేదు.