ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డీఎస్సీ పరీక్ష మెరిట్ జాబితా విడుదల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 15, 2019, 03:01 PM

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ పరీక్ష మెరిట్ జాబితాను ఏపీ విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. రాజమహేంద్రవరంలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి గంటా ఈ ఫలితాలను రిలీజ్ చేశారు. ఏపీలో మొత్తం 7,902 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి డీఎస్సీ పరీక్షను నిర్వహించామని మంత్రి తెలిపారు. ఈ పరీక్ష కోసం 6,08,155 మంది దరఖాస్తు చేయగా.. 5,05,547 మంది రాత పరీక్షకు హాజరయ్యారని వెల్లడించారు.


జిల్లాలు, సబ్జెక్టుల వారీగా మెరిట్‌ జాబితాను రూపొందించామని మంత్రి పేర్కొన్నారు. తొలిసారిగా మ్యూజిక్, క్రాఫ్ట్ టీచర్ల పోస్టులను భర్తీ చేశామన్నారు. ఈ పరీక్షకు సంబంధించి మొత్తం 136 అభ్యంతరాలను స్వీకరించామన్నారు. ఎంపికైన అభ్యర్థులకు  మే నెల 15వ తేదీన నియామక పత్రాలు అందజేస్తామనీ, వారికి 10 రోజుల పాటు శిక్షణ అందజేస్తామని మంత్రి గంటా అన్నారు.  అభ్యర్థులు తమ ఫలితాలను http://apdsc.cgg.gov.in వెబ్ సైట్ లోచూసుకోవచ్చు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com