గ్రామాల అభివృద్దికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. మంగళవారం కల్లూరు మండలం పెద్దటేకూరులో తహసీల్దారు కె. ఆంజనే యులు ఆధ్వర్యంలో నిర్వహించిన రెవెన్యూ గ్రామసభలో జాయింట్ కలెక్టర్ బి.నవ్యతో కలిసి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా గౌరు చరిత మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన భూ రీసర్వేలో అనేక తప్పులు చోటు చేసుకున్నాయని రైతుల సమస్యల పరిష్కారానికి సీఎం చంద్రబాబు గ్రామసభలకు శ్రీకారం చుట్టారని అన్నారు. రెవెన్యూ గ్రామసభలో వచ్చిన ప్రతి అర్జీకి అధికారులు పరిష్కారం చూపుతారన్నారు.
పెద్దటేకూరులో శ్మశాన వాటిక సమస్య, ఇళ్ల స్థలాలకు వెళ్లేదారి బాగుచేయాలని, వాటర్‌షెడ్ నిర్మాణాలు చేయాలని తెలిపారని త్వరలో వాటిని పరిష్కరిస్తామన్నారు. అనం తరం జాయింట్ కలెక్టర్ బి.నవ్య మాట్లాడుతూ భూ వివాదాల పరిష్కారమే రీసర్వే లక్ష్యమన్నారు. గ్రామంలో 2763 ఎకరాల భూమి ఉండగా రీసర్వేలో కేవలం 88 సెంట్లు మాత్రమే వ్యత్యాసం వచ్చిందన్నారు. అనంతరం ఎమ్మెల్యే, జేసీ రైతుల నుంచిఅర్జీలు స్వీకరించారు. రైతుల నుంచి మొత్తం 165 అర్జీలు వచ్చాయి. కార్యక్రమంలో మండల సర్వేయర్ శ్రీనివాసులు, ఏపీ ఫైనాన్స అర్బన ఇనఫ్రాస్ట్రక్షర్ డెవలప్మెంట్ డైరెక్టర్ డి.రామాంజనుయులు, మాజీ ఎంపీటీసీ యాగంటయ్య, సర్పంచు పద్మావతి, ఎంపీటీసీ మునిస్వామి, టీడీపీ నాయ కులు సాయి తరుణ్‌రెడ్డి, రఘరాముడు, వెంకటేష్, దొడ్డిపాడు బాషా పాల్గొన్నారు.