ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రిమండలి చర్చించింది. అలాగే వలంటీర్ల వ్యవస్థ పునరుద్ధరణపై కేబినెట్‌లో చర్చకు వచ్చింది. గతేడాది ఆగస్టులోనే వలంటీర్ల కాలపరిమితి ముగిసిందని ఈ సందర్భంగా అధికారులు కేబినెట్‌కు తెలియజేశారు. కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా నాడు వలంటీర్లతో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాజీనామా చేయించారని పలువురు మంత్రులు తెలియజేశారు. తప్పుడు విధానాలు.. దొంగ పద్ధతుల్లోనే జగన్ పాలన సాగించారని ఈ సందర్భంగా మంత్రులు చెప్పారు.