జానీ మాస్టర్ పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది. ఇప్పటికే బాధితురాలు స్టేట్మెంట్‌ను పోలీసులు రికార్డ్ చేసినట్లుగా తెలుస్తోంది. మైనర్‌గా ఉన్న సమయంలోనే జానీ ముంబై హోటల్‌లో తనపై అత్యాచారం చేసినట్లుగా బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు జానీ కేసులో ఎఫ్‌ఐఆర్‌లో పోక్సో యాక్ట్ యాడ్ చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న జానీని పట్టుకునేందుకు పోలీసులు కొన్ని బృందాలుగా విడిపోయి మరీ సెర్చ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరో వైపు జానీ మాస్టర్ కేసుపై ‘లవ్ జిహాద్’ ఆరోపణలు చేశారా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి.