కొత్త లిక్కర్ పాలసీకి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ప్రైవేట్ మద్యం దుకాణాలకు అనుమతిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.100 లోపు నాణ్యమైన మద్యం అందుబాటులోకి తేవాలని మంత్రి వర్గం నిర్ణయించింది. రూ.99కే నాణ్యమైన మద్యం అందుబాటులోకి తేవడానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం చంద్రబాబు ప్రకటించిన వరద సాయం ప్యాకేజీకి కేబినెట్ ఆమోదం తెలిపింది.