వలంటీర్ల పునరుద్దరణపై మరింత సమాచారం తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. గత ప్రభుత్వం సాక్షి పత్రిక కొనుగోళ్లల్లో చేసిన అవకతవకలపైనా కేబినెట్‌లో చర్చ జరిగింది. రెండేళ్లల్లోనే సాక్షి పత్రిక కొనుగోళ్ల కోసం ప్రభుత్వ ఖజానా నుంచి రూ. 205 కోట్లు ఖర్చు చేశారని మంత్రిమండలి సమావేశంలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలియజేశారు. నిబంధనలకు విరుద్ధంగా సాక్షికి జరిపిన చెల్లింపులపై విచారణకు ఆదేశిద్దామని ముఖ్యమంత్రి చెప్పారు. సాక్షి పత్రిక సర్క్యులేషన్ ఎంతుంది..? ఏ నిబంధనల ప్రకారం సాక్షి పత్రిక కొనుగోళ్లకు నిధులు కేటాయించారనే దానిపైనా ఎంక్వైరీ వేయాలని పలువురు మంత్రులు పేర్కొన్నారు.