ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నా వీడియోని మార్పింగ్ చేసారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 25, 2024, 09:19 PM

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహార శైలి తలనొప్పిగా మారింది. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ రచ్చ రచ్చ చేసింది. దివ్వెల మాధురి, దువ్వాడ శ్రీనివాస్‌ల వ్యవహారం ట్రెండింగ్ అయింది. ఇది కాస్త మరుగున పడిందని అనుకుంటున్న తరుణంలో తాజాగా మరో ఎమ్మెల్సీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన వీడియో కాల్‌లో మాట్లాడుతూ అసభ్యకరంగా ప్రవర్తించినట్లు అందులో క్లియర్‌గా కనిపించింది. ఇప్పుడది తీవ్ర ధుమారం రేపుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో కాల్‌లో అవతలివారితో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ అనంతబాబు.. ముద్దులు పెట్టడంతోపాటు అసభ్యకరంగా ప్రవర్తించినట్లు పూర్తిగా రికార్డు అయింది. అయితే వైరల్ అవుతున్న ఈ వీడియోపై ఎమ్మెల్సీ అనంతబాబు స్పందించారు. అది మార్పింగ్ చేసిన వీడియో అని అన్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా వీడియో కాల్‌లో పిల్లలకు ముద్దులు పెట్టిన వాటిని ఎడిట్ చేశారని అనంతబాబు చెప్పారు. మార్పింగ్ వీడియోలతో గత ఆరు నెలలుగా తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆయన అంటున్నారు. తన వీడియోలను మార్పింగ్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. హనీ ట్రాప్ చేసి తనను ఉద్దేశ పూర్వకంగానే ఈ వీడియోలో ఇరికించారని ఎమ్మెల్సీ అనంతబాబు ఆరోపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com