ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పులివెందుల ఎమ్మెల్యే జగన్ కి వెలుగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు : డోల బాల వీరాంజనేయ స్వామి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 20, 2024, 05:05 PM

పులివెందుల ఎమ్మెల్యే జగన్ కి వెలుగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు కొట్టుకుపోతే ఆ గేటు పెట్టలేని జగన్ చంద్రబాబు గురించి మాట్లాడటం సిగ్గుచేటు. ప్రాజెక్టు పూర్తి కాకుండానే పూర్తి చేసినట్టు జాతికి అంకితం చేసి ప్రజాధనం దుర్వినియోగం చేసింది జగన్ కాదా? టన్నెల్ డయామీటర్ రెండున్నర మీటర్లు తగ్గించారు. గత ఐదేళ్లలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వలేకపోయారని జగన్ ఒప్పుకున్నారు, ఈ పాపం జగన్ ది కాదా ? 2019లో జగన్ మాయమాటలు నమ్మి ప్రజలు గెలిపిస్తే వారిని మోసం చేశారు. ఈసారి ప్రకాశం జిల్లా ప్రజలు జగన్ ఫేక్ ప్రచారాన్ని తిప్పి కొట్టారు. ప్రజలు బుద్ధి చెప్పినా జగన్ తన తీరు మార్చుకోకుండా పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు. జగన్ ఇకనైనా తప్పుడు ప్రచారం మానుకోవాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com