శ్రీశైలం జలాశయానికి భారీగా వరద కొనసాగుతోంది. జలాశయం 10 గేట్లు 14 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో : 2,86,919 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో : 4,11,236 క్యూసెక్కులు. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం : 882.50 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం : 202.0439 టీఎంసీలకు చేరుకుంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం నుంచి నీటిని నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు విడుదల చేయడంతో సాగర్‌కు భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుకుంటోంది. ప్రాజెక్టు నుంచి 26 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 16 గేట్లు పదిఅడుగుల మేర…..10 గేట్లు 5 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తు్న్నారు.