ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కళ్యాణదుర్గంలో భక్తిశ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 08, 2024, 02:12 PM

కళ్యాణదుర్గం పట్టణంలోని జయ నగర్ కాలనీలో వెలసిన మద్దిలేటి స్వామి ఆలయంలో గురువారం నాగుల చవితి సందర్భంగా పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున నాగుల కట్టకు పాలు పోశారు. ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి నాగుల కట్టకు ప్రత్యేక పూజలు నిర్వహించి పాలు పోసి పూజలు చేశారు. నాగుల చవితి పండుగ సందర్భంగా భక్తులతో ఆలయం కిటకిటలాడింది. స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com