చక్రాయపేట తహశీల్దార్ కార్యాలయం ఎదుట టీడీపీ నాయకుడు మాజీ జెడ్పీటీసీ రాధాకృష్ణ, బీజేపీ నాయకుడు రామచంద్ర గురువారం ధర్నా దిగారు. మండలంలోని సురభి పంచాయతీ నాగులగుట్టపల్లె వద్ద కోర్టులో ఉన్న భూమినీ డిస్ప్యూట్లో గత తహశీల్దార్ నరేంద్ర ఆచారి పెట్టడంతో డిస్ప్యూట్లో నుంచి తీసివేయాలని ధర్నాకు దిగారు. దీంతో కోర్టు నుంచి ఆర్డర్ కాపీ తీసుకొని వస్తే తప్ప తానేం చేయలేనని ప్రస్తుత తహశీల్దార్ బెన్నీ రాజు అన్నారు.