పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న పీఎం పోషణ్ మధ్యాహ్న భోజన పథకము మెనూ ప్రకారం అందుతున్నదని ఒంటిమిట్ట ఎంఈఓ జి వెంకటసుబ్బయ్య గురువారం తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి విద్యార్థులకు అందిస్తున్నారని తెలిపారు. భోజనం తయారీ, పాఠశాల పరిసరాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు.