మంత్రాలయం పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ రమేశ్ అనారోగ్యంతో మృతి చెందినట్లు ఎస్సై గోపీనాథ్ శనివారం తెలిపారు. రమేశ్ 15 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ రాత్రి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మృతి చెందారన్నారు. 1998 బ్యాచ్ కు చెందిన రమేశ్ గతంలో ఆదోని వన్ టౌన్, ట్రాఫిక్ స్టేషన్లలో పనిచేశారని, ప్రస్తుతం మంత్రాలయంలో విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు.