గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో ఆర్ధిక విధ్వంసం జరిగిందని మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలు చేశారు. అన్ని మంత్రిత్వ శాఖలు ఈ ఇబ్బందులు ఎదుర్కుంటున్నాయని తెలిపారు. శనివారం యనమలకుదురులో వెలగపూడి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మాణం చేసిన ఆరోగ్య మందిర్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య రంగంలో అనేక అక్రమాలు, అవకతవకలు జరిగాయని.. వీటిపై విచారణ చేసి త్వరలో చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.