ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మానసిక వ్యాధితో యువకుడు ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 22, 2024, 04:18 PM

కర్నూలు మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారపేటకు చెందిన చెన్నయ్య (24) అనే యువకుడు తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి తండ్రి లేడు. తల్లి రామేశ్వరి కూలీ పనులు చేస్తూ జీవిస్తుంది. చెన్నయ్య గత కొద్ది కాలంగా మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. తండ్రి లేకపోవడంతో తరుచూ బాధపడుతుండేవాడని తల్లి పిర్యాదులో పేర్కొంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో సీలింగ్‌కు ఉన్న ఇనుము కొక్కేకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురికి తరలించారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మురళీధర్‌ రెడ్డి తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com