మైదుకూరు పట్టణంలో సోమవారం బక్రీద్ పండగ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మైదుకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ. బక్రీద్ పండగలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, ముస్లిం సోదరులకు బక్రీద్ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేశారు.