బక్రీదు పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని సోమవారం చేజర్ల మండలంలోని ఆదూరుపల్లి ఈద్గాలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మౌలానా మహబూబాషా ఆధ్వర్యంలో బక్రీద్ పండుగ ప్రత్యేకతను వివరించారు. ప్రతిరోజు ఐదు పూట్ల నమాజు స్థాపించాలని, పేదవారికి సహాయం చేస్తూ జీవించాలని తెలిపారు. ప్రత్యేక ప్రార్థనల్లో గ్రామంలోని ముస్లిం సోదరులు పాల్గొన్నారు.