కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలు పెంచడాన్ని నిరసిస్తూ ఆదివారం మండల కేంద్రమైన ఇంకొల్లులో కాంగ్రెస్ పార్టీ వినూత్న ప్రదర్శన నిర్వహించింది. పర్చూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మాజీ ఇన్ చార్జి జానకి రామారావు భుజంపై గ్యాస్ సిలిండర్ ను మోస్తూ ఆయన నిరసన తెలిపారు. ఎన్నికలు ముగియగానే తమ అక్కర తీరగానే ఎన్డీఏ ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచి ప్రజలపై అదనపు భారం మోపిందన్నారు. పెంచిన ధర తగ్గించాలని డిమాండ్ చేశారు.