చీరాల మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం శనివారం మధ్యాహ్నం వైస్ చైర్మన్ బి. జే బాబు అధ్యక్షతన జరిగింది. 11 అంశాలతో కూడిన అజెండాను ప్రవేశపెట్టగా కౌన్సిల్ రెండు అంశాలు రద్దుచేసి 9 అంశాలకు ఆమోదం తెలిపింది. ప్రజా సమస్యల పరిష్కారానికి సదాసిద్ధంగా ఉంటామని, ప్రజా ప్రతినిధులు తమ దృష్టికి సమస్యలు తేవాలని నూతన మున్సిపల్ కమిషనర్ చక్రవర్తి కోరారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఎఫెక్ట్ ఈ సమావేశంలో కనిపించింది.