చీరాల రామ్ నగర్ సమీపంలో శనివారం ఆర్టీసీ బస్సు, బైకు ఢీకొనగా ఒక యువకుడు తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్ళాడు. రాంనగర్ వద్ద ఒక వేడుక జరుగుతుండడంతో ఒకవైపు రోడ్డుకు తాళ్లు కట్టేయగా రేపల్లె వెళుతున్న ఆర్టీసీ బస్సు రాంగ్ రూట్ లో వచ్చి ఎదురుగా వస్తున్న బైకును ఢీకొంది. దీంతో బైకు నడుపుతున్న ఐటీసీ ఉద్యోగి పులిపాటి బుచ్చిబాబు కిందపడగా తలకు తీవ్ర గాయమై కోమాలోకి వెళ్ళాడు. హుటాహుటిన బుచ్చిబాబును గుంటూరు తరలించారు.