ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి పంచాంగం

Astrology |  Suryaa Desk  | Published : Fri, Jun 14, 2024, 11:49 AM

నేడు 14 జూన్ 2024 శుక్రవారం, స్వస్తిశ్రీ చంద్రమాన క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ రుతువు, జ్యేష్ట మాసం, శుక్లపక్షం.ఇవాళ 5 గంటల 31 నిమిషాలకు సూర్యోదయం.నేడు సాయంత్రం 6 గంటల 34 నిమిషాలకి సూర్యాస్తమయం అవుతుంది.ఇవాళ తిథి అష్టమి రాత్రి 12 గంటల 3 నిమిషాల వరకూ ఉంది. తర్వాత నవమి.వారం: బృగువాసరె, నక్షత్రం: ఉత్తరపల్గుని. రోజంతా ఉంటుంది.


యోగం: సిద్ధి, రాత్రి 7 గంటల 6 నిమిషాల వరకూ ఉంది. తర్వాత వ్యతీపాత, కరణం: భద్ర, ఉదయం 10 గంటల 49 నిమిషాల వరకూ ఉంది. తర్వాత బవ, రాత్రి 12 గంటల 3 నిమిషాల వరకూ ఉంది. తర్వాత బాలవ,అమృతకాలం రాత్రి 12 గంటల 5 నిమిషాల నుంచి.. 1 గంట 53 నిమిషాల వరకూ ఉంది. నిజానికి ఈ అమృత కాలాన్ని శుభ సమయం, అమృత ఘడియలుగా పరిగణిస్తారు.దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 21 నిమిషాల నుంచి 9 గంట 14 నిమిషాల వరకూ ఉంది. తిరిగి మధ్యాహ్నం 12 గంటల 42 నిమిషాల నుంచి 1 గంట 34 నిమిషాల వరకూ ఉంది. ఇది మంచి ముహూర్తం కాదు. అందువల్ల ఎవరూ ఈ సమయంలో ముహూర్తాలు పెట్టుకోరు.రాహుకాలం ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల వరకు ఉంది. రాహుకాల సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని ప్రజలు నమ్ముతారు. కాబట్టి ముఖ్యమైన పనులను ఆ సమయంలో చేయరు.అన్నింటికన్నా ముఖ్యమైనది వర్జ్యం. వర్జ్యం అంటే విడువ తగినది, అశుభ సమయం. శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. ఈ రోజు వర్జ్యం మధ్యాహ్నం 1 గంట 15 నిమిషాల నుంచి 3 గంటల 3 నిమిషాల వరకూ ఉంది.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com