పెడన నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తానని కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. బుధవారం తన నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు, మోదీ, పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృధ్ది చెందుతుందన్నారు. నియోజకవర్గంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులతో సమన్వయంతో పనిచేస్తానని, తన తండ్రి కాగిత వెంకట్రావు బాటలో నడుస్తూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. పెడన ఎమ్మెల్యేగా గెలుపొందిన కాగిత కృష్ణప్రసాద్‌ను బూరగడ్డ వేద వ్యాస్ తనయుడు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బూరగడ్డ కిషన్‌తేజ్ ఘనంగా సన్మానిం చారు. జనసేన నాయకుడు సుజ్ఞానం సతీష్, డీసీ మాజీ చైర్మన్ గౌరిశెట్టి వెంక టేశ్వరరావు, జడ్పీటీసీ అర్జా నగేష్, ప్రసాద్ అభినందనలు తెలిపారు.