నర్సీపట్నంలో బుధవారం ఓ కారు బీభత్సం సృష్టించింది. నర్సీపట్నం సీబీఎం కాంపౌండ్ వద్ద మామిడి పండ్లు విక్రయించుకునే వ్యాపారిపై కారు దూసుకుపోయింది. దీంతో ఆ వ్యాపారి కారు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన చేపట్టారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.