పాణ్యం నియోజకవర్గ ఉమ్మడి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా గౌరు చరిత వెంకటరెడ్డి గెలుపొందిన సందర్భంగా నంద్యాల పార్లమెంట్ ఇంచార్జి మాండ్ర శివానందరెడ్డి గురువారం కర్నూలు నగరంలోని మాధవి నగర్ లో ఉన్న గౌరు చరిత వెంకటరెడ్డి స్వగృహానికి వెళ్లి మరియద పూర్వకంగా కలిశారు. అనంతరం బొకే ఇచ్చి వారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, శ్రీనివాసులు పాల్గొన్నారు.