కౌతాళం మండలం ఓబుళాపురం గ్రామంలో పిడుగుపడి 5 మేకలు మృతి చెందాయి. గ్రామ సమీపంలోని పొలంలో కోసిగికి చెందిన కాపరులు మేకలు మేపుతుండగా భారీ వర్షం కురవడంతో మేకలను చెట్ల కిందకు తీసుకెళ్లామని గొర్రెల కాపరులు గురువారం తెలిపారు. ఒక్కసారిగా పిడుగు పడటంతో ఐదు మేకలు అక్కడికక్కడే మృతిచెందినట్లు మేకల కాపరి మలిగేరి అంజనయ్య తెలిపారు.