మిడుతూరు చుట్టుపక్కల ప్రాంతాలలో గురువారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షాలకు తలముడిపి కుందు వాగు, మిడుతూరు మండలం కేంద్రంలో నంద్యాల రోడ్డుపై వాగు ప్రవహించడంతో నందికొట్కూరు నుండి నంద్యాల వెళ్లే బస్సుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రోడ్డుపై నీటి ప్రవాహం తగ్గిన వెంటనే నంద్యాలకు బస్సులను పంపిస్తామని నందికొట్కూరు డిపో అధికారులుతెలిపారు.