నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం చింతలాయ పల్లెలో దారుణం జరిగింది. టీడీపీ కార్యకర్త మంజుల నాగేంద్ర(40)ను వైసీపీ వర్గీయులు ఇనుప సుత్తి, బండ రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేసినట్లు సమాచారం. ఇదే గ్రామంలో 2019 ఎన్నికల తర్వాత సుబ్బారావు అనే టీడీపీ నేతను హత్య చేశారు. మళ్లీ ఇప్పుడు ఎన్నికల అనంతరం మరో హత్య జరగడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది.