ఎన్నికల్లో ప్రజాతీర్పును గౌరవిస్తారని, టీడీపీ కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దని, అండగా ఉంటానని టీడీపీ ఎమ్మెల్యేఅభ్యర్థి వీరభద్రగౌడ్ అన్నారు. బుధవారం ఆలూరు టీడీపీకార్యాల యంలో నిర్వహించిన కార్యకర్తలసమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో నన్నుఆదరించి ఓట్లువేసిన ప్రతికార్యకర్తకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో గెలుపుకోసం ప్రయత్నించి నా స్వల్పమెజార్టీతో ఓటమి పాలయ్యనన్నారు. ఎవరూ నిరాశకు గురికావొద్దన్నారు.