కొడాలి, అంబటి, రోజా, వెల్లంపల్లి వంటి వైసీపీ నాయకుల నోటి దురుసుతనంతోనే ప్రజలు వైసీపీని భూస్థాపితం చేశారని టీడీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన కర్నూలు జిల్లా పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ చంద్రబాబును ఇబ్బందులకు గురిచేసిన జగన్మోహన్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీకి ఇంతటి విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.