ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంగళగిరిలో వైయ‌స్ఆర్ విగ్రహాలను ధ్వంసం చేసిన టీడీపీ కార్యకర్తలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 06, 2024, 02:45 PM

రాష్ట్రంలో టీడీపీ, జనసేన శ్రేణులు విధ్వంసం సృష్టిస్తున్నాయి. యథేచ్ఛగా విగ్రహాలు, శిలాఫలకాలు ధ్వంసం చేస్తూ వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులపై దాడులకు తెగబడు­తు­న్నాయి. వాహనా­లను ధ్వంసం చేస్తు­న్నాయి. మంగళవారం మొదలు­పెట్టిన ఈ అరాచకప­ర్వాన్ని టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు బుధవారం కూడా కొనసాగించారు. ఈ రెండురోజులు ప్రభుత్వ భవనాల వద్ద ఫలకాలను చిత్రపటాలను ధ్వంసం చేస్తూ స్వైరవిహారం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో మహానేత వైయ‌స్ఆర్ విగ్రహాలను ధ్వంసం చేసి, విగ్రహాల వద్ద కూటమి జెండాలు ఏర్పాటు చేశారు. ఇప్పటంలో ప్రజల భాగస్వా­మ్యంతో నిర్మించిన దివగంత ముఖ్యమంత్రి డాక్టర్ వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా పేరుతో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ హాల్‌ భవనం పైభాగంలో జన­సేన, టీడీపీ జెండాలను ఏర్పాటు చేశారు. డాక్టర్ వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి పేరును తొలగించారు. దుగ్గిరాల మండలం ఈమని గ్రామంలో 1, 2 సచివాలయాల వద్ద వైఎస్‌ జగన్‌  డిజి­­టల్‌ బోర్డులను తొలగించి రోడ్డుపై పడవేసి చిత్ర­పటంపై రాళ్లు వేశారు. నూతన సచివాలయం శిలా­ఫలకంలో ఉన్న వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రప­టాన్ని చిన్నపిల్లలతో పగులగొట్టించారు. రైతు­భరోసా కేంద్రంపై నవరత్నాల బోర్డును ధ్వంసం చేశారు. పల్నాడు జిల్లా గోళ్ళపాడులో వైయ‌స్ఆర్‌ విలేజ్‌ క్లినిక్‌ శిలాఫలకాన్ని పగులగొ­ట్టారు. తిరుపతి జిల్లా పుత్తూరులో పలు ఆలయాల వద్ద వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆర్కే రోజా పేరిట ఉన్న శిలా­ఫలకాలను బుధవారం సాయంత్రం తెలుగు­దేశం­ నాయకులు ధ్వంసం చేశారు. శ్రీకామాక్షీ సమేత శ్రీసదాశివేశ్వరస్వామి ఆలయం లోపల ఏర్పాటు చేసిన అన్నదాన, కళ్యాణోత్సవ మండప శిలాఫల­కాన్ని, ఆరేటమ్మ ఆలయం వద్ద పలు అభివృద్ధి పనుల పేరిట ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని, గేట్‌పు­త్తూరులోని గోవిందమ్మ ఆల­యం వద్ద ప్రారంభించిన జగనన్న సమావేశమందిర శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. తెలుగుదేశం నాయకులు డి.జి.ధన­పాల్, బి.శ్రీనివాసులు చేసిన ఈ విధ్వంసంపై పుత్తూరు సెంగుంధర్‌ మక్కల్‌ నల సంఘం ఆధ్వర్యంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు ఎస్‌.ఎన్‌.­గోపిరమణ, టి.జి.శక్తివేలు, ఎం.ఎస్‌.తిరు­నా­వక్క­ర్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నెల్లూరు జిల్లా దగ­దర్తి మండలంలోని యలమంచిపాడులో వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త షేక్‌ మస్తాన్‌పై టీడీపీ నాయకులు దాడిచేశారు. అడ్డుకోబోయిన ఆయన తల్లి షేక్‌ బీబీ తలపైకొట్టి తీవ్రంగా గాయపరిచారు. ఆమెను నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తడక­లూరులో వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త యలమా వెంకటే­శ్వర్లు ద్విచక్ర వాహనాన్ని పెట్రోల్‌ పోసి తగుల­బెట్టారు. మరికొన్ని గ్రామాల్లో కూడా కవ్వింపు చర్య­లకు దిగుతున్నారు. గ్రామాల్లో వివాదాలు జర­గ­కుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కావ­లి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి కోరారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com