తాడిపత్రి ఆదర్శ పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకో వాలని ప్రిన్సిపల్ లావణ్య తెలిపారు. పాఠశాలలో 7, 8, 9 తగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 12వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని, 13న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారనాను. మెరిట్, రోస్టర్ ఆధారంగా ఎంపిక జరుగుతుందన్నారు. ఆసక్తి కల్గిన విద్యార్థులు పాఠశాల వద్దకు వచ్చి దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.