లొకేశ్వరం మండలం రాజురా గ్రామంలో గురువారం మన ఊరు మన అంగన్వాడీ బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికీ వెళ్లి చిన్నారుల తల్లిదండ్రులకు ప్రభుత్వం పౌష్టికాహారం, గుడ్లు, నాణ్యమైన భోజనం అందిస్తుందని చైతన్య పరిచారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, తప్పకుండా అంగన్ వాడీ కేంద్రానికి పంపించాలని కోరారు. అంగన్వాడీ టీచర్లు పద్మ, శోభ, లలిత పాల్గొన్నారు.