ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ కళ్యాణ్ కు ప్రముఖుల అభినందనలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 05, 2024, 09:09 PM

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పలువురు ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేనాని పవన్ కల్యాణ్ విజయం పట్ల టాలీవుడ్ అగ్ర కథానాయకుడు వెంకటేశ్ స్పందించారు. "ప్రియమైన పవన్ కల్యాణ్... చారిత్రక విజయం సాధించినందుకు కంగ్రాచ్యులేషన్స్. ఇంతటి ఘన విజయాన్ని అందుకోవడానికి నీకంటే అర్హులెవరూ లేరు మిత్రమా. నువ్వు మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని, ఇకమీదట కూడా నీ కఠోర శ్రమతో, నీ శక్తితో, ప్రజలకు సేవ చేయాలన్న అంకితభావంతో స్ఫూర్తి కలిగిస్తూనే ఉండాలని కోరుకుంటున్నాను" అంటూ వెంకీ ట్వీట్ చేశారు. అంతేకాదు... మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను పిఠాపురం ఎమ్మెల్యే గారూ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. వెంకటేశ్, పవన్ కల్యాణ్ గతంలో 'గోపాల గోపాల' అనే చిత్రంలో కలిసి నటించిన సంగతి తెలిసిందే.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com