అమెరికాలో మెడిసిన్ చదివే వారికి ఇచ్చిన మెటీరియల్ వల్లే సంపాదించానని గుంటూరు తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ వివరించారు. ఇంటర్‌లో 15 నుంచి 17 గంటలపాటు కష్టపడి చదివానని, ఇక్కడ మెడిసిన్ పూర్తి చేశానని వెల్లడించారు. అమెరికా అంటే ఇష్టంతో అక్కడికి వెళ్లి పీజీ చేశానని స్పష్టం చేశారు. పీజీ చేసి, ప్రాక్టీస్ ప్రారంభించానని చంద్రశేఖర్ తెలిపారు. తనకు రోగులను చూడటం అంటే ఇష్టం అని గుర్తు చేశారు. అమెరికాలో మెడిసిన్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ కష్టంగా ఉంటుందని, ఆ ప్రిపరేషన్ కోసం మెటీరియల్ రూపొందించానని తెలిపారు. మెటీరియల్ ఆన్ లైన్‌లో అందుబాటులో ఉంచానని చెప్పారు. దాని వల్ల చాలా మందికి మేలు జరిగిందని స్పష్టం చేశారు. మెటీరియల్‌ను ఆన్ లైన్‌లో ఉంచామని, మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పారు. క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేసే ఆప్షన్ ఇచ్చామని, ఒకరు కొనుగోలు చేసి, ఒకరు వాడేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. ఆ మెటీరియల్ ఎవరూ కాపీ కొట్టలేరని స్పష్టం చేశారు.