చీరాల రాజకీయాలు చిత్ర విచిత్రమైన మలుపులు తిరుగుతున్నాయి. ఎప్పుడు ఎవరు ఏ వైపు ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్సీ పోతుల సునీత వర్గీయుడు, మాజీ ఎంపీటీసీ గోలి ఆనందరావు సోమవారం మాజీ మంత్రి బాలినేని వాసు సమక్షంలో చీరాల వైసీపీ అభ్యర్థి కరణం వెంకటేష్ కు జై కొట్టడం అందరినీ విస్మయపరిచింది. ఇదే ఆనందరావు పై గతంలో రెండుసార్లు కరణం వర్గీయులు దాడి చేయగా ఆయన కేసులు కూడా పెట్టారు. ఇప్పుడేమో ఆ వైపే మొగ్గారు.