ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దాడి విషయంలో ప్రతిపక్షాలన్నీ ఒకేరకంగా మాట్లాడుతున్నాయి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 16, 2024, 12:55 PM

సీఎం వైయ‌స్ జగన్ పై దాడి డ్రామా అని ప్రతిపక్షాలు అనడం సరికాదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. సిధ్దం సభ భారీ సభలు...మేమంతా సిధ్దం బస్సుయాత్రతో ప్రజలలో సీఎం వైయ‌స్ జగన్ గారికి ప్రజాదరణ విపరీతంగా వస్తుండటంతో  పుట్టగతులుండవని ప్రతిపక్షాలన్నిటికి భయం పట్టుకుందని అన్నారు. తాడేపల్లిలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ....  దాడి విషయంలో ప్రతిపక్షాలన్నీ ఒకేరకంగా మాట్లాడుతున్నాయన్నారు. నిజానికి  టిడిపినే డ్రామాలాడుతోంది. నింద తమపైకి వస్తుందని టిడిపి భయపడుతోందని వివరించారు. టిడిపి నేతలు దాడి జరిగిన దగ్గర్నుంచి అది చేయించుకున్న దాడే అని ప్రొజెక్ట్ చేయాలని చూస్తున్నారన్నారు. ఆ లైన్ కు తగినట్లే భధ్రతా వైఫల్యం అని ఎందుకు సెక్యూరిటీ లేదని ...ఎందుకు కరెంట్ తీశారని...వాళ్ళే చేయించుకున్నారని దర్యాప్తు సిబిఐ ద్వారా చేయించాలని మాట్లాడుతున్నారు. ఇక్కడ దాడి జరిగిందా లేదా...దాడికి సంబంధించి విచారణలో ఎవరు చేసిందనేది బయటపడాలి. ప్రధానంగా ఇవి రెండే ప్రాధాన్యత కలిగిన విషయాలు. వాటికి ప్రాధాన్యత ఇవ్వకుండా సంబంధంలేని సెక్యూరిటి ఏం చేస్తుంది....కరెంట్ ఎందుకు తీశారు...ఎందుకు అలెర్ట్ చేయలేదు...ఫోకస్ లైట్ ఎందుకు పెట్టలేదు.ఇవన్నీ కూడా సెక్యూరిటి డిపార్ట్ మెంట్ చర్చించుకోవాల్సిన అంశాలు. ప్రస్తుతం ఎన్నికల కమీషన్ ఆధ్వర్యంలో జరుగుతోంది కాబట్టి ఈసి ఆదేశాలమేరకు విచారణ జరుగుతుంది. దాడి అనేది జగన్ గారిపై జరిగింది. చంద్రబాబుపైనో,పవన్ కల్యాణ్ పైనో జరగలేదు.శాసనసభ్యుడు,మాజి మంత్రి వెల్లంపల్లి సైతం జగన్ గారిపై దాడి సందర్భంగా గాయపడ్డారు. బాధితులుగా ఎవరు దాడికి పాల్పడ్డారో వారిని పట్టుకోవాలి అని అడిగే రైట్ మాకుంటుంది. పోలీసు డిపార్ట్ మెంట్ పై దర్యాప్తు చేయాల్సిన బాధ్యత ఉంటుంది.  టిడిపికి తాపత్రయం ఎందుకో అర్ధం కావడం లేదు.అంటే నింద వారిపై వస్తుందని భయపడుతున్నట్లుగా ఉన్నారు. నింద మీ మీద ఎందుకు వస్తుందంటే ఇది క్యాజువల్ గా జరిగింది కాదు. దాని వెనుక నేపధ్యం ఉంది కాబట్టి టిడిపిపై అనుమానం వస్తుంది. అదే మేం ఎక్స్ ప్రెస్ చేయడం జరిగింది. టిడిపి డిమాండ్ చేయాలంటే సిబిఐ దర్యాప్తు కోరవచ్చు. విచారణ సత్వరం చేయాలని అడగవచ్చు. కాని అలా కాకుండా ఇది డ్రామా అనటం మరో విధంగా మాట్లాడటం సరికాదు. టిడిపి వాళ్ళు భయపడుతున్నారని క్లియర్ గా జనానికి అర్దం అవుతుంది. జగన్ గారిపై ఆదరణ చూసిన తర్వాత చంద్రబాబు,పవన్ కల్యాణ్ లు బేంబేలు ఎత్తిపోయి మాట్లాడుతున్నట్లుగా ఉంది అని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com